News September 1, 2025

ఒకే కారులో మోదీ-పుతిన్ ప్రయాణం

image

చైనా టియాన్‌జిన్ SCO శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా ఒకే కారులో వెళ్లారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు చెక్ పెట్టేందుకు పరస్పర సహకారంపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. SCO సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

Similar News

News September 1, 2025

యువత గుండె వయసు వేగంగా పెరుగుతోంది!

image

మిలీనియల్స్ (1981-96) & GenZ (1997-2012)లలో ‘కార్డియాక్ ఏజింగ్’ అభివృద్ధి చెందుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వారి గుండె సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందడం. అందుకే 50 ఏళ్లలో కనిపించే గుండె జబ్బులు 30 ఏళ్లలోపే చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్క్రీన్ సమయం పెరగడం, ధూమపానం వంటివి ఇందుకు కారణమని తెలుస్తోంది.

News September 1, 2025

అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: సుదర్శన్ రెడ్డి

image

రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.

News September 1, 2025

ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై దంపతుల నిద్ర

image

జపాన్ కపుల్స్ నాణ్యమైన నిద్ర కోసం ‘సపరేట్ స్లీపింగ్’ పద్ధతిని పాటిస్తారు. వారు ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై పడుకుంటారు. నిద్రలో గురక పెట్టడం, కదలడం వల్ల తమ భాగస్వామి నిద్రకు భంగం కలుగుతుందని ఇలా వేరుగా పడుకుంటారట. అయితే ఇది జంటల మధ్య దూరాన్ని పెంచుతుందని కొందరు భావిస్తే, భాగస్వామికిచ్చే గౌరవంగా మరికొందరు నమ్ముతున్నారు. కాగా జపాన్‌లో జననాల రేటు పడిపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది.