News October 27, 2024
Digital Arrest మోసాలపై స్పందించిన మోదీ

భారత న్యాయ చట్టాల్లో డిజిటల్ అరెస్టు వంటి వ్యవస్థ ఏదీ లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక మోసాలు అధికమవుతుండడంపై మన్ కీ బాత్‌లో మోదీ స్పందించారు. ఇదోరకమైన మోసమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారు సంఘ విద్రోహులని అన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల కట్టడికి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.
Similar News
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<
News November 10, 2025
టెర్రరిస్ట్ అరెస్ట్.. ఇంట్లోనే విషపదార్థం తయారీ!

గుజరాత్ పోలీసులు <<18243395>>అరెస్ట్<<>> చేసిన HYD వ్యక్తి డా.మొహియుద్దీన్ రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్ను పెద్ద మొత్తంలో పీల్చినా, ఆహారం/నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది.
News November 10, 2025
ఆ ఇద్దరిలో ఒకరికి RR పగ్గాలు?

వచ్చే IPL సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సారథి <<18248474>>సంజు శాంసన్<<>> జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ధ్రువ్ జురెల్, జైస్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RR కెప్టెన్సీ రేసులో వీళ్లే ముందున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియాన్ పరాగ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. ఎవరు RR కెప్టెనైతే బాగుంటుంది? COMMENT


