News July 9, 2025

27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ

image

నమీబియా పర్యటనలో ఉన్న PM మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధానికి అందజేశారు. 2014లో PM అయినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ అవార్డు. 5దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

image

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

News January 19, 2026

వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

image

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.

News January 19, 2026

ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

image

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.