News March 16, 2024
మోడీ సభ.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన!
ఈనెల 18న జగిత్యాలలో ప్రధాని బహిరంగ సభ సందర్భంగా పట్టణంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనికి ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మధ్య నడిచే వాహనాలు ధరూర్ కెనాల్ బైపాస్ ద్వారా వెళ్లాలన్నారు. ధర్మపురి, కరీంనగర్ మధ్య నడిచే వాహనాలు పొలాస, తిమ్మాపూర్ బైపాస్ మీదుగా వెళ్లాలన్నరు .
Similar News
News November 21, 2024
KNR: ఇతర పంటలు వేసిన రైతుల పరిస్థితి ఏంటి!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న రకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో ఇతర పంటలు వేసిన మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు భరోసా రాక, ఇటు బోనస్ రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్ ముగిసిపోయినా ఇప్పటివరకు రైతు భరోసా ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 21, 2024
రాజన్న ఆలయానికి 30,546 మంది
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం 30,546 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
News November 21, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,85,134 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.90,080 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,820, అన్నదానం రూ.35,234,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.