News June 4, 2024

మోదీ రాజీనామా చేయాలి: మమత

image

ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ప్రధాని మోదీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘మేము బీజేపీ వెన్ను విరిచి రాజకీయ రివేంజ్ తీర్చుకున్నాం’ అని ఆమె అన్నారు. పార్టీకి తక్కువ సీట్లు రావడంతో టీడీపీ, జేడీయూ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని మమత తెలిపారు.

Similar News

News September 16, 2025

కవిత రాజీనామా ఆమోదంపై సస్పెన్స్!

image

TG: బీఆర్ఎస్ మాజీ నేత కవిత MLC పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావొస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ లోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

News September 16, 2025

దీర్ఘకాలిక సంతోషానికి ఈ అలవాట్లు

image

* రోజూ 30 ని.ల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా, సైక్లింగ్) చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లు పెరుగుతాయి.
*7-9 గంటల నాణ్యమైన నిద్ర వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగై, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ధ్యానం చేయాలి.
* కుటుంబం, స్నేహితులు, సమాజంతో సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సంతోషాన్ని పొందవచ్చు.
* ఇతరులకు సహాయం చేయడం వల్ల పొందే సంతోషం, తమ కోసం ఖర్చు చేయడం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.

News September 16, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.