News March 28, 2025
మోదీ సర్.. తమిళనాడుతో జాగ్రత్త: విజయ్

డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రచిస్తున్నారని TVK పార్టీ చీఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని గారూ.. మీరు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అన్నప్పుడే మేం మీ ప్లాన్లను అర్థం చేసుకున్నాం. తమిళనాడును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈ రాష్ట్రం ఎన్నో సార్లు తన శక్తిని చూపించింది. మీరు జాగ్రత్తగా ఉండండి సర్’ అని సూచించారు.
Similar News
News March 31, 2025
ఆదిలాబాద్ గిరిజన మహిళలకు PM ప్రశంస

TG: ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాళ్లు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. మహిళలు కొత్త ప్రయోగం చేశారని అభినందించారు. కాగా అటవీ ప్రాంతాల్లో దొరికే ఇప్పపువ్వుతో గతంలో నాటుసారా తయారుచేసేవారు. అయితే ఉట్నూరుకు చెందిన కొందరు మహిళలు ఇప్పపువ్వుతో పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారుచేస్తూ, గిరిజన పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.
News March 31, 2025
MI మినహా..!

IPL ప్రారంభమై 10రోజులవుతోంది. MI మినహా జట్లన్నీ గెలుపు ఖాతా తెరిచాయి. ఆడిన 2మ్యాచ్ల్లోనూ ముంబై ఓడింది. గతంలో తొలి 5మ్యాచులు ఓడినా తిరిగి పుంజుకొని టైటిల్ గెలిచిన సందర్భమూ ఉంది. అయితే జట్టు కూర్పు సరిగా లేకపోవడమా? కెప్టెన్లు మారడమా? టాప్ ఆర్డర్ వైఫల్యమా? తదితర కారణాలపై MI త్వరగా దృష్టి పెట్టకపోతే టైటిల్ రేసులో వెనకబడటం ఖాయం. ఇవాళ KKRతో జరిగే మ్యాచ్లో అయినా గెలవాలని MI ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.