News March 18, 2024
జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.
Similar News
News April 7, 2026
NZB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సీళ్ల స్థితి, పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించిచారు.అన్ని విధానాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు
News April 7, 2026
వర్ని: ‘పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి’

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. తరగతి గదులు, అటెండెన్స్ రిజిస్టర్, మెనూ పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి అభ్యాసాన్ని పరిశీలించారు. నూతన భవన పనులు వెంటనే వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News April 7, 2026
NZB: ‘తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానానికి ముందుకు రండి’

తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉపాద్యాయ, ఉద్యోగ తదితర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ బుస ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన వీడియో ప్రకటనను విడుదల చేశారు. సంస్థలే కాకుండా ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగతంగా రెడ్ క్రాస్‌కు వచ్చి రక్తదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


