News April 8, 2024

మూడోసారి ప్రధానిగా జూన్‌లో మోదీ ప్రమాణం: కిషన్ రెడ్డి

image

TS: జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేస్తారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. మోదీ వచ్చాక దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ దిగుమతి చేసుకునేవాళ్లమని.. మోదీ వచ్చాక విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. రాహుల్ గాంధీ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Similar News

News February 24, 2026

100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, 10 కేజీల యూరియా?

image

AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కల్తీ పాల దందా కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, మరికొన్ని రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News February 24, 2026

స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

image

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News February 24, 2026

పత్తి విత్తనాల కొనుగోలు – రైతులకు సూచనలు

image

TG: పత్తి విత్తనాలను తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన లైసెన్స్ గల అధీకృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే రైతులు కొనుగోలు చేసి, బిల్లు తప్పక అడిగి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఎక్కడైనా బిల్లు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు, HT పత్తి, లూజు విత్తనాలను కలిగి ఉన్నా, అమ్ముతున్నా ఆ సమాచారాన్ని సంబంధిత మండల వ్యవసాయ అధికారికి లేదా 18005995779 (టోల్ ఫ్రీ) నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.