News November 15, 2024
ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి మోదీ

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా ఆయన ప్రయాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్‌ఘర్ విమానాశ్రయంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత సమయం తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఆలస్యమైంది.
Similar News
News November 26, 2025
చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.
News November 26, 2025
పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.


