News June 29, 2024

వెంకయ్యపై 3 పుస్తకాలు.. రిలీజ్ చేయనున్న మోదీ

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై రాసిన 3 పుస్తకాలను PM మోదీ రేపు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఆయన 75వ బర్త్‌డే సందర్భంగా HYDలో ఈ కార్యక్రమం జరగనుంది. వెంకయ్యనాయుడు-లైఫ్ ఇన్ సర్వీస్ పుస్తకాన్ని నగేశ్ కుమార్, సెలబ్రేటింగ్ భారత్- ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ వెంకయ్యనాయుడు అనే బుక్‌ను ఐవీ సుబ్బారావు, మహానేత-లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య అనే పుస్తకాన్ని సంజయ్ కిశోర్ తీర్చిదిద్దారు.

Similar News

News November 7, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.

News November 7, 2025

భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

image

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.

News November 7, 2025

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.