News October 18, 2024
వచ్చే వారం రష్యాకు మోదీ.. ఎందుకంటే!

PM మోదీ వచ్చేవారం రష్యా వెళ్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు అక్టోబర్ 22, 23 తేదీల్లో కజాన్లో BRICS 16వ సమ్మిట్లో పాల్గొంటారు. అదే టైమ్లో సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ‘Strengthening Multilateralism for Just Global Development and Security’ థీమ్తో తాజా సమ్మిట్ జరుగుతోందని పేర్కొంది. బ్రిక్స్ ప్రాజెక్టుల ప్రోగ్రెస్ను పరిశీలిస్తారంది.
Similar News
News November 21, 2025
అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
News November 21, 2025
రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.


