News August 22, 2025

జపాన్, చైనా పర్యటనకు మోదీ

image

జపాన్, చైనా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్న ఆయన 15వ ఇండియా-జపాన్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సు(SCO)లో మోదీ పాల్గొంటారు. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగా ఉండగా, చైనా పర్యటనకు మోదీ వెళ్లడం ఆసక్తిగా మారింది.

Similar News

News March 5, 2026

సిద్దిపేట: యువతి దూరమైందని సూసైడ్

image

ప్రేమించిన యువతి దూరమైందని UPకి చెందిన ప్రదీప్ కుమార్ (మేనేజర్) ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మం. వెలికట్ట శివారులోని కంపెనీలో పనిచేస్తూ దుద్దెడలో ఉంటున్న ప్రదీప్, గతంలో తనతో పనిచేసిన యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లినప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. త్రీటౌన్ CI లక్ష్మీబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2026

ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

image

ఇరాన్ వార్‌తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.

News March 5, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

<>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 12 కో ఆర్డినేటర్& సెక్యూరిటీ అడ్మిన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఏ(ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), డిగ్రీ, బీఎస్సీ(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://dicmedia.digitalindiacorporation.in