News September 2, 2025
త్వరలో మణిపుర్‌లో పర్యటించనున్న మోదీ!

PM మోదీ ఈనెల రెండో వారంలో మణిపుర్‌లో పర్యటిస్తారని తెలుస్తోంది. వందలాది ప్రాణాలు పోతున్నా PM పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం. 2023 మే 3న అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
Similar News
News September 2, 2025
ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను తగ్గించాయి. దీంతో ఈ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. PNB అన్ని టెన్యూర్స్‌పై MCLRను 15 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. అటు BOI ఓవర్‌నైట్ రేట్ మినహా అన్ని టెన్యూర్స్‌పై 5-15 పాయింట్స్ కోత విధించింది. పోటీని తట్టుకుని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News September 2, 2025
జన సైన్యానికి ధైర్యం పవన్: సీఎం చంద్రబాబు

AP: పవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
News September 2, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✒ ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ పదవీ విరమణ.. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి?
✒ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ నెల 5లోపు ఫీజు చెల్లింపు, 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్
✒ రాష్ట్రంలో గత 8 నెలల్లో 181 మంది అవినీతి అధికారుల అరెస్ట్
✒ రాష్ట్ర GST వసూళ్లలో 12% వృద్ధి
✒ నాగారం భూదాన్ భూముల కేసులో రూ.4.80 కోట్ల ఆస్తుల జప్తు