News October 5, 2025
16న శ్రీశైలానికి మోదీ.. కీలక ప్రతిపాదనలు!

AP: ప్రధాని మోదీ ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటికి రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, Dy.CM సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉంది. ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, నూ క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 6, 2026
ప్రైవేట్ స్కూళ్లకు ‘ప్రొఫెషనల్’ షాక్

TG: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించే పనిలో ఉంది.
News March 6, 2026
లక్ష మందికి ఉగాది కానుక!

AP: ఉగాది పండుగ పురస్కరించుకొని లక్ష మందికి ఈ నెల 18వ తేదీన టిడ్కో ఇళ్లు అందజేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక TDR బాండ్ల జారీలో గత ప్రభుత్వం వందల రూ.కోట్ల అక్రమాలకు పాల్పడిందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు.
News March 6, 2026
ముందు ఇరాన్.. తర్వాత క్యూబా: ట్రంప్

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ వెల్లడించారు. ఇరాన్‌పై పోరుపై దృష్టిపెట్టానని.. అది అయిపోయాక త్వరలోనే క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్‌లోని ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించింది. కాగా ఇటీవల <<19260435>>క్యూబాను<<>> అమెరికా స్నేహపూర్వకంగా దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.


