News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.
Similar News
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.
News November 24, 2025
ఫ్లైట్లో ఈ 10 వస్తువులు నిషేధం అని తెలుసా?

విమాన ప్రయాణాలు చేసేవారు ఈ 10 వస్తువులను క్యారీ చేయకూడదు. కొబ్బరికాయ, కేన్డ్ ఫుడ్ను ఫ్లైట్లో తీసుకెళ్లకూడదు. అధిక పీడనం కారణంగా అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి ముక్కలు, తురుము తీసుకెళ్లవచ్చు. సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రొటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్, నిషేధ రసాయనాలతో తయారు చేసిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్స్ను విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం అమలులో ఉంది.
News November 24, 2025
బిడ్డ ఆరోగ్యానికి పునాది అక్కడే..

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో కూడిన ‘మైక్రో బయోమ్’ పెరగడం ఆరంభమవుతుంది. గర్భిణి ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే ఈ ‘గట్ మైక్రోబయోమ్’ తల్లి నుంచి శిశువుకు వస్తుంది. మనం పుట్టినప్పుడు ఉండే మైక్రోబయోమ్ స్థితి బట్టి.. మన జీవితం ఎంత సాఫీగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మైక్రో బయోమ్ మారి రకరకాల వ్యాధులు వస్తుంటాయి.


