News September 3, 2024
ప్రసిద్ధ మసీదును సందర్శించిన మోదీ

బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రాజధాని బందర్ సేరి బెగవాన్‌లోని చారిత్రక సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. అక్కడ కొంతసేపు గడిపి మసీదు చరిత్ర వివరాల వీడియోను వీక్షించారు. అనంతరం ఇమామ్‌తో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. బ్రూనై ప్రస్తుత సుల్తాన్ హస్సనల్ బోల్కియా తండ్రి పేరు మీదుగా ఈ మసీదును 1958లో నిర్మించారు. సుల్తాన్ సైఫుద్దీన్‌ను ఆధునిక బ్రూనై రూపశిల్పిగా పరిగణిస్తారు.
Similar News
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
News November 28, 2025
గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.
News November 28, 2025
కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.


