News February 3, 2025
జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ.. జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో PM మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయన్నారు. మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు. చంద్రచూడ్ నిజాయితీపరుడని, కోర్టు వ్యవహారాలపై PMతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు. కాగా జస్టిస్ రాయ్ నిన్న పదవీ విరమణ చేశారు.
Similar News
News March 31, 2026
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల శాతం 70గా ఉండగా దానిని 50%కు తగ్గిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది.
News March 31, 2026
యుద్ధం.. భారీగా పెరగనున్న ధరలు

పశ్చిమాసియా యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. AP, TGలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. వారంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బస్తా రూ.280-320 మధ్య ఉండగా పెంపు తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు వాడే పెట్రోలియం కోక్ 130 డాలర్ల నుంచి 165కు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్ రూ.23.75 పెంచడం ధరల పెరుగుదలకు కారణం.
News March 31, 2026
ఎలాంటి భోజనం తృప్తినిస్తుంది?

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గాడిద పాలు కడవ నిండా ఉన్నా గరిటెడు ఆవు పాలతో సమానం కాదు. అలాగే ప్రేమ, భక్తితో పెట్టిన కొద్ది భోజనమైనా ఎంతో తృప్తిని ఇస్తుందని అర్థం.
<<-se>>#PADHYAM<<>>


