News May 15, 2024
మోదీVsరాహుల్.. ఎవరు రిచ్?
LS ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోదీ, రాహుల్ గాంధీ తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. మోదీ ₹3.02కోట్ల ఆస్తులున్నాయని, సొంతకారు, ఇల్లు లేదని తెలిపారు. మరోవైపు తనకు ₹20కోట్ల ఆస్తులున్నట్లు రాహుల్ వెల్లడించారు. తనకు సొంతిల్లు లేదని, రూ.49.7లక్షల అప్పుందన్నారు. మోదీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి 1983లో మాస్టర్స్ పూర్తి చేయగా.. రాహుల్ 1995లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ చేశారు.
Similar News
News January 11, 2025
ఆమెపై పరువునష్టం దావా: గరికపాటి టీమ్
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన మహిళను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఆయన టీమ్ తెలిపింది. సరస్వతుల కామేశ్వరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు SMలో ప్రకటించింది. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకూ లీగల్ నోటీసులు పంపించినట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని గరికపాటి టీం పేర్కొంది.
News January 11, 2025
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.
News January 11, 2025
ఈవీలకు పన్ను రాయితీ
AP: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0(2024-2029)ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇది ఉన్నంతకాలం ఈవీలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. హైబ్రిడ్ 4 వీలర్స్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.