News June 5, 2024
NDA పక్షనేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో కీలక తీర్మానానికి నేతలు ఆమోదం తెలిపారు. NDA పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీర్మానంపై చంద్రబాబుతో పాటు 21 మంది నేతలు సంతకాలు చేశారు. దీంతో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Similar News
News January 4, 2026
ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పొడిగింపు

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.