News July 9, 2024
ఆస్ట్రియాకు పయనమైన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియాకు పయనమయ్యారు. 41 ఏళ్లలో ఓ భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. అంతకుముందు 1955లో జవహర్ లాల్ నెహ్రూ ఆ దేశంలో పర్యటించారు. దీంతో ఆస్ట్రియాలో పర్యటించనున్న మూడో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. వియన్నాలో ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెల్లెన్‌తో మోదీ భేటీ కానున్నారు.
Similar News
News December 2, 2025
తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.
News December 1, 2025
GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. కాగా <<18393033>>ఈ విస్తరణతో<<>> 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.


