News September 21, 2025

2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

image

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.

Similar News

News September 21, 2025

రేపటి నుంచి సందడే సందడి..

image

జీఎస్టీ తగ్గింపు ఫలాలు రేపటి నుంచి దేశ ప్రజలకు అందనున్నాయి. పాలు, సబ్బులు, టూత్ పేస్ట్, దుస్తులు, పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, టీవీలు, ఏసీలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు.. ఇలా చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. రేపటి నుంచి షోరూంలు కిటకిటలాడనున్నాయి. మరి మీరు ఏ వస్తువు కొంటున్నారు? కామెంట్ చేయండి.

News September 21, 2025

వరిలో ఎలుకల నివారణకు ఇలా చేయండి

image

* బ్రోమోడయోలిన్ మందు 10-15 గ్రా.(పిడికెడు నూకలు, కాస్త నూనెతో కలుపుకుని) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టాలి.
* ఈ మందును 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టుకోవాలి.
* కన్నాల దగ్గర పొగబారించుకోవడం ద్వారా ఎలుకలను తరిమివేయవచ్చు.
* ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి.
* ఎలుకలను నిర్మూలించడానికి రైతులు సామూహికంగా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
<<-se>>#PADDY<<>>

News September 21, 2025

13,217పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు

image

<>IBPS <<>>గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: SC/ST/ PwBD ₹175,ఇతరులు : ₹850. వెబ్‌సైట్: www.ibps.in