News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 20, 2025
ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.
News October 20, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ కాగా ICICI బ్యాంక్, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ONGC టాప్ లూజర్స్.
News October 20, 2025
తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.