News April 11, 2024

మాల్దీవుల అధ్యక్షుడికి మోదీ విషెష్

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేశ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకున్నారు. మాల్దీవుల సాంస్కృతిక, నాగరికత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలు కరుణ, సోదరభావం, ఐక్యతతో మెలగాలని అభిలషించారు. ఇది శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రంజాన్ కరుణ, దాతృత్వం, సామరస్యానికి ప్రతీక అని ఆయన తెలిపారు.

Similar News

News February 5, 2026

వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

image

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.

News February 5, 2026

ఖర్జూరంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్‌.. కారణమిదే!

image

* ఖర్జూరాలను బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
* ఎక్కువ సమయం ఆకలి వేయదు.
* ఒకటి/రెండు తినే సరికి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆకలి తక్కువ వేస్తుంది.
* ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ల కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
* తక్కువ క్యాలరీలు తీసుకోవడంతో హెల్తీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

News February 5, 2026

రైతులకు రిటర్న్ ప్లాట్‌లు.. 16న లాటరీ

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న ప్లాట్‌ల కేటాయింపునకు CRDA లాటరీ తీయనుంది. ఈ-లాటరీ ద్వారా రైతులకు నిబంధనల ప్రకారం ప్లాెెట్‌లు కేటాయిస్తారు. వాటిని రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.