News February 20, 2025
మోదీ x రాహుల్: బైడెన్ ఎవరిని గెలిపించాలని అనుకున్నారు?

ఓటింగ్ శాతం పెంచేందుకు USAID $21M కేటాయించడాన్ని బట్టి 2024 లోక్‌సభ ఎన్నికలను అమెరికా ప్రభావం చేసినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. చాలా NGOలు ఓటర్ల నమోదు డ్రైవ్స్ చేపట్టడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. భారత్‌లో జోబైడెన్ ఎవర్నో గెలిపించేందుకు ప్రయత్నిచారని <<15519378>>ట్రంప్<<>> చెప్పడంతో ఫోకస్ మోదీ, రాహుల్‌పై మళ్లింది. మరి ఆయన వారిద్దరిలో ఎవరికి మద్దతిచ్చినట్టు? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News December 8, 2025
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.
News December 8, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్మెంట్లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.
News December 8, 2025
ఇంటి చిట్కాలు మీ కోసం..

* నిమ్మచెక్కతో మైక్రోవేవ్ పైభాగాన్ని శుభ్రం చేస్తే మచ్చలు త్వరగా పోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీలుకు బేబీ ఆయిల్ రాస్తే గీతలు పడకుండా దృఢంగా ఉండడమే కాదు కొత్తదానిలా తళతళలాడుతుంది.
* ఫ్రిజ్‌లో తరిగిన నిమ్మకాయ ముక్క పెడితే సువాసనలు వెదజల్లుతుంది.
* ఇంట్లోని సింకు బ్లాక్ అయితే సోడియం బైకార్బొనేట్తో పాటు ఒక బాటిల్ వైట్ వెనిగర్ ని కూడా వేస్తే నీళ్లు సింకులోంచి వేగంగా పోతాయి.


