News April 4, 2024

మోదీజీ మీరు మత్తులో ఉన్నారా?: ఖర్గే

image

PM మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ‘భయపడట్లేదు అంటున్న మీరు, భారత్‌లోకి చైనా చొరబడుతుంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్రమాత్రలు తీసుకున్నారా? విదేశాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ మణిపూర్‌కు ఎందుకు వెళ్లట్లేదు? కుటుంబ పాలన గురించి మాట్లాడతారు, కానీ 1989 తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని లేదా మంత్రి అయ్యారా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 3, 2025

రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

image

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్‌లో జరగనుంది.

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

News December 3, 2025

సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

image

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.