News November 10, 2024

మోదీజీ.. సామాన్యులు సురక్షితంగా ఉండేది ఎప్పుడు?: రాహుల్

image

బిహార్‌లో రైలు ఇంజిన్, బోగీల మధ్య <<14569710>>చిక్కుకొని<<>> ఉద్యోగి చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘మోదీజీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు? మీరేమో అదానీని రక్షించడంలో బిజీగా ఉన్నారు. ఈ భయానక చిత్రం రైల్వేలో సుదీర్ఘకాలంగా తాండవిస్తున్న నిర్లక్ష్యానికి, అంతంతమాత్రంగానే జరుగుతున్న నియామకాలకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 9, 2026

‘నో ఫోన్ ఛాలెంజ్’.. మీ పిల్లలకూ విసరండి!

image

విద్యార్థులు ఫోన్లకు బానిసలవకుండా కేరళలోని కూతుపరంబ స్కూల్ టీచర్ అమృత ‘నో ఫోన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని పిల్లలకు స్టిక్కర్లు, ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పిల్లల్లో సానుకూల పోటీని పెంచింది. మీరూ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండేందుకు ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. రోజంతా ఫోన్ చూడకుంటే బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ సమయాన్ని క్రియేటివ్ వర్క్స్‌పై ఉపయోగించేలా చూడండి.

News February 9, 2026

డిజిటల్ మోసాలపై కఠిన చర్యలకు SC ఆదేశాలు

image

డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొంది. డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా కొల్లగొట్టడాన్ని దోపిడీగా అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా మోసాల నివారణకు RBI రూపొందించిన ఎస్‌ఓపీని (Standard Operating Procedure) అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

News February 9, 2026

కసిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

AP: సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు SC ధర్మాసనం నిరాకరించింది. రూ.750 కోట్ల కుంభకోణంలో 9నెలలుగా జైలులో ఉండటం పెద్ద సమయమేమీ కాదని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌లో ఎన్ని రూ.కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. వాదనలు వినిపించేందుకు కసిరెడ్డి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.