News August 18, 2025
మోదీ ప్రకటన.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,100, నిఫ్టీ 360 పాయింట్లు లాభపడ్డాయి. GST సంస్కరణలు ఉంటాయన్న ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఆటోమొబైల్, FMCG స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. HCL Tech, ITC, L&T, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Similar News
News August 18, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం?

ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు NDA కసరత్తులు చేస్తోంది. ఇదే విషయమై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీ నేతలతో BJP నేతలు మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల బరిలో నిలవాలని INDI కూటమి ఆలోచనలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ప్రకటించిన సంగతి తెలిసిందే.
News August 18, 2025
కేంద్ర మంత్రి జైశంకర్‌తో లోకేశ్ భేటీ

AP: ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఏపీకి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు పియూశ్ గోయల్, అశ్విని వైష్ణవ్‌తోనూ లోకేశ్ సమావేశం కానున్నారు.
News August 18, 2025
‘కూలీ’, ‘వార్-2’ 4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ రూ.275 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి.