News March 17, 2024
ఏపీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి
ఏపీ ప్రజలు 2 సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం. రెండో సంకల్పం APలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోంది. NDA సర్కారును గెలిపిస్తే AP అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’ అని వెల్లడించారు.
Similar News
News December 22, 2024
క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీం షాక్
క్రెడిట్ కార్డుల బకాయిలపై బ్యాంకులు భారీ వడ్డీలు విధిస్తుంటాయి. ఏకంగా 35 శాతం నుంచి 50శాతం వరకూ వడ్డీలు విధించడాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ గతంలో తప్పుబట్టింది. వడ్డీ 30శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. దానిపై బ్యాంకులు సుప్రీంను ఆశ్రయించగా విచారణ అనంతరం వాటికి అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది. 30శాతానికిపైగా వడ్డీని విధించుకోవచ్చని పేర్కొంది.
News December 22, 2024
అమెరికాలో పెగాసస్ ప్రకంపనలు
పెగాసస్ స్పైవేర్ మళ్లీ వెలుగులోకొచ్చింది. ఈ స్పైవేర్‌ను వృద్ధి చేసిన Israel కంపెనీ NSO చట్ట వ్యతిరేక చర్యలను USలోని ఓ కోర్టు మొదటిసారిగా గుర్తించింది. WhatsApp వేసిన కేసులో 1400 మంది యూజర్లపై దీన్ని వాడినట్టు కోర్టు నిర్ధారించింది. 2021లో 300 మందిపై NDA Govt నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ విచారించింది. విచారణలో కేంద్రం తమకు సహకరించలేదని కమిటీ తెలిపింది.
News December 22, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి
అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.