News October 7, 2025

పుతిన్‌కు మోదీ బర్త్‌డే విషెస్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బర్త్‌డే సందర్భంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి విషెస్ తెలియజేశారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరువురు నేతలూ ఆకాంక్షించారు. పుతిన్ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు.

Similar News

News March 25, 2026

ఆముదం సాగుకు అనువైన రకాలు

image

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు

News March 25, 2026

‘రండి చూసుకుందాం’.. USకు ఇరాన్ సవాల్!

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది సైనికులను పశ్చిమాసియాకు పంపాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. 20 ఏళ్లుగా తాము దీని కోసమే ట్రైన్ అవుతున్నామని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతినిధి అడ్మిరల్ అహ్మదియాన్ పేర్కొన్నారు. ‘ఇంకా దగ్గరకు రండి’ అంటూ సవాల్ విసిరారు. దీన్ని బట్టి ఇరాన్ సైన్యం నేరుగా తలపడేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

News March 25, 2026

ఉగ్రవాద దేశం మధ్యవర్తిత్వమా?

image

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండటంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాక్‌కు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇరాన్ తర్వాత షియా ముస్లింలు ఎక్కువగా ఉండటం, ట్రంప్‌తో పాక్ ఎయిర్ మార్షల్ మునీర్ స్నేహం కారణంగానే ఇది సాధ్యమైందని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్?