News April 24, 2024
కాంగ్రెస్-ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఈసీకి ఫిర్యాదు

కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ <<13098974>>వ్యాఖ్యలపై<<>> ఈసీకి హస్తం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని, చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తెచ్చేలా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది. మొత్తంగా 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. విపక్ష పార్టీపై ఆయన తప్పుడు నిందలు వేశారని తెలిపింది.
Similar News
News October 18, 2025
రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

AP: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని, దీంతో రేపట్నుంచి వర్షాలు పెరిగే ఆస్కారముందని చెప్పింది.
News October 18, 2025
నిద్రమత్తులోనే ఉండండి.. టీటీడీపై HC ఆగ్రహం

AP: పరకామణిలో అక్రమాల వ్యవహారంపై ఇటీవల పోలీస్ శాఖపై <<17999947>>విరుచుకుపడ్డ<<>> హైకోర్టు నిన్న టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరికొంత కాలం నిద్రమత్తులోనే ఉండండి అంటూ మండిపడింది. కౌంటర్ ఎందుకు వేయలేదని ఈవోపై ఆగ్రహించింది. తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.
News October 18, 2025
విత్తనాలు కొంటున్నారా? రసీదు జాగ్రత్త..

రబీ సీజన్ ప్రారంభమైంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీల్ తీసి ఉన్న, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాలను కొనరాదు. తూకం వేసి విత్తనాలు తీసుకోవాలి. విత్తనం వల్ల పంట నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే పంటకాలం పూర్తయ్యేవరకు కొనుగోలు రశీదులను రైతులు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత సరిగా రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం.