News April 15, 2025

కంచ గచ్చిబౌలిపై మోదీ కామెంట్స్.. మంత్రుల కౌంటర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తోందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటరిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో తాము చెట్లు నరకలేదని, జంతువులను చంపట్లేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

Similar News

News April 16, 2025

‘వక్ఫ్’పై ఆందోళనలు హింసాత్మకం కావడం బాధాకరం: సుప్రీం

image

వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ జరిగిన <<16100810>>ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై<<>> సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటనలు తమను బాధించాయని పేర్కొంది. అనంతరం వక్ఫ్ చట్టంపై ప్రశ్నించగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జవాబిచ్చారు. ‘వక్ఫ్ చట్టం కోసం చాలా కసరత్తు చేశాం. బిల్లుపై JPC 38 సమావేశాలు నిర్వహించింది. 98.2 లక్షల విజ్ఞప్తుల్ని పరిశీలించింది’ అని తెలిపారు.

News April 16, 2025

ఏపీకి అండగా ఉండండి: CM విజ్ఞప్తి

image

APకి కీలకమైన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానానికి నిధులు ఇవ్వాలని CM చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి నిధులు కోరారు. అమరావతి, తిరుపతి, విశాఖలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు గ్రాంట్లు, పోర్టులు, హార్బర్లు, లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులు నిర్మించేలా సాయానికి విజ్ఞప్తి చేశారు.

News April 16, 2025

గుజరాత్ నుంచే BJP, RSS ఓటమికి నాంది: రాహుల్

image

గుజరాత్ నుంచే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఓటమికి నాంది పలుకుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ఇప్పుడు జరుగుతున్న ఫైట్ కేవలం రాజకీయపరమైనది కాదు. ఇది BJP-RSS, కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరు. బీజేపీని ఓడించగలిగే ఏకైక పార్టీ కాంగ్రెసేనని యావత్ దేశానికి తెలుసు. త్వరలో పార్టీలో సమూల మార్పులు చేయనున్నాం’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!