News July 26, 2024
ఆ స్కీమ్‌పై NDA, INDIAకు మోదీ పరోక్ష సంకేతాలు!

విపక్షాలు, మిత్ర పక్షాలకూ మోదీ ఒకేసారి ఓ సిగ్నల్ పంపినట్టు అనిపిస్తోంది. <<13711134>>అగ్నిపథ్ స్కీమ్<<>>ను ఎన్నికలకు ముందు ఇండియా కూటమి విమర్శించింది. రిజల్టు రాగానే JDU, LJP నేతలూ తిరిగి పరిశీలించాలన్నారు. స్కీమ్‌లో కేంద్రం మార్పులు చేస్తుందని బడ్జెట్ ముందు అనేక వార్తలు వచ్చాయి. అయితే అగ్నిపథ్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్మీకిది అవసరమంటూ లద్దాక్ వద్ద ప్రధాని చేసిన ప్రసంగం వీటిని పటాపంచలు చేసింది.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>
News December 6, 2025
బంధం బలంగా మారాలంటే?

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.


