News August 30, 2025

బుల్లెట్ ట్రైన్‌లో మోదీ ప్రయాణం

image

జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి మోదీ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ విశేషాలను మోదీకి ఇషిబా వివరించారు. అంతకుముందు ప్రధాని జపాన్ గవర్నర్లతో టోక్యోలో సమావేశం అయ్యారు. ఇరుదేశాల స్నేహానికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

Similar News

News August 30, 2025

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

News August 30, 2025

ఇలాంటి వాట్సాప్ గ్రూపులు అన్ని ఊర్లలో ఉంటే..!

image

ఎమర్జెన్సీలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సంగారెడ్డిలో ‘నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్’ పేరిట 8 ఏళ్లుగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దాంట్లో మెసేజ్ చేస్తే చాలు దగ్గరున్నవాళ్లు అక్కడికి వస్తారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ ప్రతి గ్రామానికీ ఉంటే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడటమే కాకుండా ఊరి ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి.

News August 30, 2025

ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

image

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.