News September 22, 2024
ఇండో – పసిఫిక్ దేశాలకు మోదీ కీలక హామీ

క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా ఇండో-పసిఫిక్ దేశాలకు భారత్ తరఫున 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని PM మోదీ హామీ ఇచ్చారు. క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్లతోపాటు రేడియోథెరపీ, క్యాన్సర్ నిర్మూళనకు సామర్థ్యాల పెంపులో సాయం చేస్తామన్నారు. కోట్లాది ప్రజల జీవితాల్లో ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని చెప్పారు. క్వాడ్ ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు.
Similar News
News November 27, 2025
బోధన్: 13 నెలల చిన్నారిని చిదిమేసిన ఆటో

సాలూరు మండలం సాలంపాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి ఆటోలో వచ్చిన వ్యక్తి అజాగ్రత్తగా నడిపి గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇర్ఫాన్, అయోష బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ బోధన్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్‌గా గుర్తించారు.
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.


