News May 2, 2024
TDPతో పొత్తుపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఏపీలో TDPతో పొత్తు పెట్టుకోవడంపై PM మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పొత్తును ఎన్నికలకు పరిమితం చేయొద్దు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది మా సిద్ధాంతం. అందుకే మాకు మెజార్టీ ఉన్నా TDPని చేర్చుకున్నాం. లాభనష్టాలను లెక్కలేసుకుని రాజకీయాలు చేయం. ఆచరణ సాధ్యమైన చోటే పొత్తులు కుదుర్చుకుంటాం. ఇటీవల CBN-పవన్తో కలిసి పెద్ద ర్యాలీలో పాల్గొన్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.
News December 14, 2025
ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. 2019లో మెహర్ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్ ‘భగవంత్ కేసరి’లో మెప్పించారు.
News December 14, 2025
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.


