News April 14, 2024

అణ్వాయుధాలపై మోదీ కీలక వ్యాఖ్యలు

image

దేశాన్ని రక్షించుకునేందుకు అణ్వాయుధాలు కలిగి ఉండటం తప్పనిసరి అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. విపక్ష కూటమిలోని పార్టీలు అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రమాదకర హామీలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. శత్రుదేశాలు అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్న తరుణంలో మన వద్ద అవి లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. వీటిని వద్దని చెప్పేవారు దేశాన్ని ఎలా రక్షిస్తారని నిలదీశారు.

Similar News

News November 17, 2024

రోహిత్‌తో ఆస్ట్రేలియాకు షమీ?

image

కొడుక్కి జన్మనిచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ BGT తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. అతడితో పాటు సీనియర్ పేసర్ షమీ కూడా AUSకు వెళ్తారని సమాచారం. రోహిత్ తొలి టెస్టుకు జట్టులో చేరుతారని, షమీని రెండో టెస్టుకు ముందు స్క్వాడ్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. BGT ఫస్ట్ టెస్ట్ ఈనెల 22 నుంచి జరగనుంది.

News November 17, 2024

హృతిక్ రోషన్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణమిదే!

image

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టైమ్ వేస్ట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కొత్త సినిమాలకు సైన్ చేయాలి లేదా రిటైర్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ‘SIGN MOVIES OR RETIRE HRITHIK’ అని Xలో ట్రెండ్ అవుతోంది. గత ఏడేళ్లలో ఆయన 4 సినిమాలే చేశారు. 2018, 2020, 2021, 2023లో ఆయన మూవీస్ రాలేదు. ప్రస్తుతం NTRతో కలిసి చేస్తున్న ‘WAR-2’ 2025లో రిలీజ్ కానుంది.

News November 17, 2024

సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే

image

ఉద్యోగాల పేరుతో జ‌రిగే మోసాల్లో 75% ఆశావ‌హుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ స‌ర్వేలో తేలింది. ఫేక్ రిక్రూట‌ర్‌ల‌ను గుర్తించ‌డంలో విఫ‌ల‌మై మోస‌గాళ్ల‌కు న‌గ‌దు చెల్లిస్తున్నార‌ని, సున్నిత‌మైన స‌మాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జ‌రిపిన స‌ర్వేలో అత్య‌ధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.