News May 25, 2024
మోదీ భాష, బీజేపీ సీట్లు.. రెండూ దిగజారుతున్నాయి: రాహుల్

ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలంటించారు. మోదీ భాష, బీజేపీ సీట్లు రెండూ రోజురోజుకూ దిగజారుతున్నాయని ఎద్దేవా చేశారు. కాగా ఇవాళ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ‘ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇండియా కూటమి వారి ముందు ముజ్రా(పురుషులను ఆకట్టుకునేందుకు మహిళలు చేసే నృత్యం) చేస్తోంది’ అని విమర్శించారు. దీనిపైనే రాహుల్ తాజాగా స్పందించారు.
Similar News
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.
News January 2, 2026
మొక్కజొన్నకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం.. నివారణ ఎలా?

మొక్కజొన్న తోటల్లో కత్తెర పురుగు ఉద్ధృతి పెరిగింది. ఇది మొక్క మొలక దశ నుంచే ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు మొక్కజొన్న కాండం, ఆకులను తిని రంధ్రాలను చేస్తాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచి కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తాయి. ఆకు సుడులను కూడా తింటాయి. దీని వల్ల మొక్కకు తీవ్ర నష్టం జరిగి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కత్తెర పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 2, 2026
ఇతిహాసాలు క్విజ్ – 115

ఈరోజు ప్రశ్న: రావణుడిని జైలులో పెట్టిన వానర రాజు ఎవరు? తన అజేయమైన శక్తితో రావణుడిని ఏం చేశాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


