News June 30, 2024
టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రశంసించారు. చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యను, అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్‌ను అభినందించారు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌ను మోదీ కొనియాడారు.
Similar News
News December 4, 2025
నైపుణ్య లోటుపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో వివరాలు కోరారు. కేవలం 3% మంది కార్మికులకే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతికతల వినియోగ వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఎఫ్ఐసీఎస్ఐ ద్వారా చర్యలు తీసుకుంటూ 60 విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.
News December 4, 2025
సింగపూర్ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

AP: గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 4, 2025
టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.


