News August 25, 2024

పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా మోదీ విమానం?

image

ఇటీవల పోలాండ్ నుంచి భార‌త్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన PM మోదీ ప్ర‌యాణిస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గ‌గ‌న‌త‌లాన్ని వినియోగించుకుంద‌ని అక్కడి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు చెబుతున్నాయి. తిరిగి అమృత్‌సర్ మీదుగా 11:46 గంటలకు భారత గగనతలంలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి.

Similar News

News January 17, 2026

రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.

News January 17, 2026

ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

image

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It

News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in