News June 18, 2024
NEETపై మోదీ మౌనం.. రాహుల్ విమర్శలు

NEET వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. బిహార్, గుజరాత్, హరియాణాల్లోనే అరెస్టులు జరిగాయని, పేపర్ లీకులకు BJP పాలిత రాష్ట్రాలు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 24లక్షల విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతున్నా మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారన్నారు. తమ పార్టీ పేపర్ లీకులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించేలా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.
Similar News
News March 24, 2026
చింతూరు సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌సీలో మంగళవారం అరుదైన, క్లిష్టమైన శిశువు జననం చోటుచేసుకుంది. ఎర్రంపేట గ్రామానికి చెందిన గర్భిణీ (6 నెలలు) పరీక్షల కోసం ఆసుపత్రికి రాగా డాక్టర్ రమణరావు గర్భంలోని శిశువుకు తీవ్రమైన అభివృద్ధి లోపం (అనేన్సఫెలీ) ఉన్నట్లు గుర్తించారు. తల్లి ఆరోగ్యం విషమంగా మారడంతో, వైద్య బృందం అత్యవసరంగా ఎల్‌ఎస్‌సీఎస్ శస్త్రచికిత్స నిర్వహించి తల్లి ప్రాణాలను కాపాడారు.
News March 24, 2026
జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలం: కలెక్టర్

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.


