News September 21, 2025
సా.5 గంటలకు మోదీ ప్రసంగం

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.
Similar News
News September 21, 2025
ALERT: ఇవాళ భారీ వర్షాలు

TG: ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8 గంటల వరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి వేళ్లలో వర్షాలు కురుస్తాయని వివరించింది.
News September 21, 2025
వరిలో సుడిదోమ నివారణకు ఇలా చేయండి

* సుడి దోమను తట్టుకునే వంగడాలను సాగు చేసుకోవాలి.
* పొలంలో ప్రతి 2 మీటర్లకు 20CM కాలిబాటలను వదలాలి.
* దోమలు పిల్ల దశలో ఉంటే లీటరు నీటికి బుప్రోఫెజిన్ 1.6ML కలిపి పిచికారీ చేయాలి.
* పిల్ల, పెద్ద పురుగులు వరి దుబ్బుకు 25కి పైగా ఉంటే పైమెట్రోజెన్ 0.6 గ్రా/లీటరు, లేదా డైనోటెఫ్యూరాన్ 0.4గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* నత్రజని ఎరువులను సిఫారసు మేరకు వాడాలి.
<<-se>>#PADDY<<>>
News September 21, 2025
జన్‌జీ ఉద్యమం వస్తుందన్న KTR.. బండి సంజయ్ రిప్లై ఇదే!

TG: నేపాల్ తరహాలో INDలోనూ జన్‌జీ ఉద్యమం రావొచ్చన్న <<17778245>>KTR కామెంట్స్‌పై<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘నేపాల్ జన్‌జీ నెపోటిజంపై పోరాడారు. తెలంగాణ జన్‌జీ వారి కంటే ముందే KCR, ఆయన పిల్లల్ని పక్కన పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో BRSకు బిగ్ జీరో ఇచ్చారు. ఫ్యామిలీ రూల్‌ను అంతం చేశారు’ అని ట్వీట్ చేశారు. KTRను నెపో కిడ్‌గా పేర్కొంటూ NDTV-YUVA కాన్‌క్లేవ్‌లో ఆయనకు యువత రియాలిటీని చూపించిందన్నారు.