News November 19, 2024

ఇందిరా గాంధీకి మోదీ నివాళి

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అలాగే రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగానూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చూసిన ధైర్యసాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు. కష్టకాలంలో ఆమె నాయకత్వం నిజమైన సంకల్పం ఏమిటో చూపించిందన్నారు.

Similar News

News November 19, 2024

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,070కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.700 పెరిగి రూ.70,650గా నమోదైంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరిగి రూ.1,01,000 పలుకుతోంది.

News November 19, 2024

బేబీ బంప్‌తో అతియా శెట్టి.. పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి బేబీ బంప్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే రాహుల్-అతియా జంట ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరికి బిడ్డ జన్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా రాహుల్-అతియా గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు.

News November 19, 2024

షేర్లు కొనేందుకు సరైన టైమ్ ఏదంటే..

image

మంచి పోర్టుఫోలియో నిర్మాణానికి స్టాక్ మార్కెట్లు, ఎకానమీపై బ్యాడ్ న్యూస్ విపరీతంగా వస్తున్న కాలమే సరైందని ABSL AMC MD బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బలమైన ఫండమెంటల్స్ కలిగిన షేర్లు అప్పుడే తక్కువ ధరకు దొరుకుతాయన్నారు. భారత $10 ట్రిలియన్ల కల ఈ 4 నెలలతో చెదిరిపోదని, బలమైన క్రెడిట్‌ గ్రోత్ ఎకానమీని నడిపిస్తుందని తెలిపారు. బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ కొనొచ్చని, ఎకానమీ పెరగ్గానే ఇవి లాభాలు ఇస్తాయన్నారు.