News July 10, 2024
మోదీ పర్యటన విజయవంతం: రష్యా మంత్రి

ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైనట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక ఎజెండాలోని అంశాలన్నీ చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు రష్యా మద్దతు ఉంటుందని మీడియాకు వెల్లడించారు.
Similar News
News October 22, 2025
TG న్యూస్ రౌండప్

☛ రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు సా.5గంటల లోపు మూసేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు
☛ నల్గొండ: మైనర్పై అత్యాచారం కేసు.. నిందితుడు చందుకు 32ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు
☛ రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి: ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు
News October 22, 2025
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News October 22, 2025
మరో సినిమాపై కాపీరైట్ కేసు వేసిన ఇళయరాజా

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘Dude’ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ చిత్రయూనిట్పై ఫిర్యాదు చేశారు. దీంతో మేకర్స్, సంగీత దర్శకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీ, మంజుమ్మల్ బాయ్స్, మిసెస్ & మిస్టర్ సినిమాలపై కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే.