News June 23, 2024
విశాఖలో మోగ్లిక్స్ కేంద్రం

AP: విశాఖపట్నం కేంద్రంగా రూ.10 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మోగ్లిక్స్ సేవలు ప్రారంభించనుంది. పారిశ్రామిక సంస్థలు, MSMEలకు అవసరమైన ఉత్పత్తులను కంపెనీ సరఫరా చేయనుంది. ఇప్పటికే HYD, నోయిడాలో రెండు టెక్నాలజీ హబ్‌లు నిర్వహిస్తున్న ఈ సంస్థకు MSMEలో 5 లక్షల మంది, 700 భారీ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఫార్మా, MSME విభాగంలో సంస్థకు క్లయింట్లు ఉన్నాయి.
Similar News
News January 22, 2026
ఈ ఫుడ్స్ తింటే పదేళ్లు యంగ్‌గా కనిపిస్తారు

చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తే ఎక్కువ కాలం యంగ్‌గా కనిపించొచ్చని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఉసిరికాయల్లో ఉండే కొల్లాజెన్ స్కిన్‌ను ముడతలు పడకుండా, సాగిపోకుండా కాపాడుతుంది. దానిమ్మగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్‌ను యవ్వనంగా మారుస్తాయి. రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పులు తింటే చర్మం మెరుస్తుంది.
News January 22, 2026
గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.
News January 22, 2026
నలుపు రంగును అశుభంగా ఎందుకు భావిస్తారు?

మన ధర్మశాస్త్రాల ప్రకారం.. నలుపు రంగును చీకటి, శూన్యం, అజ్ఞానానికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే ఇది శని గ్రహానికి కూడా సంకేతం. కష్టాలను, మందగమనాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే నలుపు కిరణాలను పీల్చుకుంటుంది. కానీ తిరిగి ప్రసరించదు. అందుకే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని శుభకార్యాల్లో నివారిస్తారు. అయితే, దిష్టి తగలకుండా నలుపు చుక్క, దారం వాడుతారు. ఇలా ఈ రంగు రక్షణకు చిహ్నంగా ఉపయోగపడుతుంది.


