News October 19, 2024

పాకిస్థాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్?

image

పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చర్చించినట్లు సమాచారం. ఈ నెల 28న రిజ్వాన్ పేరును పీసీబీ అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 21, 2025

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే?

image

బ్రహ్మ ముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన లేకుండా పోతుంది. ఈ వేళ లేచేవారి గుండె, మెదడు పనితీరు, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీవకణాలు ఉద్రేకం పొంది, దైవికారోగ్యం లభిస్తుంది.

News October 21, 2025

ఇవాళ మధ్యాహ్నమే ‘మూరత్ ట్రేడింగ్’

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్‌లో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. మీరూ ‘మూరత్ ట్రేడింగ్’ చేస్తున్నారా?

News October 21, 2025

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.