News August 4, 2024
మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే పథుమ్ నిస్సంక వికెట్ తీశారు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కారు. గతంలో దేబశిష్ మహంతి(1999), జహీర్ ఖాన్(2001, 2002, 2007, 09), ప్రవీణ్ కుమార్(2010) తొలి బంతికే వికెట్ తీశారు.
Similar News
News March 13, 2026
ఇళ్లు లేనివారికి శుభవార్త

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
News March 13, 2026
యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.
News March 13, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


