News March 19, 2025

SRH జెర్సీలో మహ్మద్ షమీ.. పిక్ వైరల్

image

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.

Similar News

News September 18, 2025

హిండెన్‌బర్గ్ కేసు.. అదానీకి సెబీ క్లీన్‌చిట్

image

అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఛైర్మన్ గౌతమ్ అదానీపై షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల కేసును కొట్టేసింది. కాగా అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లను మ్యానిపులేట్ చేస్తూ డొల్ల కంపెనీలతో నిధులను సమీకరిస్తోందని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇది భారత మార్కెట్లను కుదిపేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తాజాగా వెల్లడించింది.

News September 18, 2025

నాగార్జున 100వ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

అక్కినేని నాగార్జున నటించనున్న వందో సినిమాలో ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కింగ్100’ అనే టైటిల్‌ ఖరారైందని, దీనిని ఆర్.కార్తీక్ డైరెక్ట్ చేస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీ లాంచ్ ఉంటుందని సమాచారం. ఆర్.కార్తీక్ గతంలో ‘ఆకాశం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

image

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>