News February 21, 2025
మహమ్మద్ షమీ ‘ది వారియర్’

మహమ్మద్ షమీ ఓటమిని ఒప్పుకోరు. గతేడాది కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితి నుంచి CT తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన వరకు తన కృషి పోరాట యోధుడికి ఏ మాత్రం తీసిపోదు. గాయంతో ఏడాదికి పైగా జట్టుకు దూరమైనా, BGTకి సెలక్ట్ కాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించకపోయినా పట్టుదల వదల్లేదు. ఏడాదిలోనే కమ్ బ్యాక్ చేసి బంగ్లాపై 5 వికెట్లు తీశారు. స్లో పిచ్‌పై రాకెట్ల లాంటి బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
Similar News
News February 21, 2025
అఫ్గాన్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

CT-2025: అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 315 రన్స్ చేసింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. SA బౌలర్లలో రబాడ 3, ఎంగిడి, మల్డర్ తలో 2 వికెట్లు తీశారు.
News February 21, 2025
గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా: లోకేశ్

AP: రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్ చేశారు. వారి బాధ, ఆందోళనను అర్థం చేసుకుని లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెడతామని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
News February 21, 2025
నాకు సపోర్ట్‌గా నిలిచినందుకు రెహమాన్‌కు థాంక్స్: మాజీ భార్య సైరా

తాను ఇటీవల ఆస్పత్రిలో చేరినప్పుడు అండగా నిలిచిన ఏఆర్ రెహమాన్‌కు ఆయన మాజీ భార్య సైరా ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో సపోర్ట్ ఇచ్చిన సన్నిహితులు, స్నేహితులకు కూడా ఆమె థాంక్స్ చెప్పారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రెహమాన్-సైరా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.