News March 11, 2025

CM రేవంత్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు

image

TG: నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సీఎం రేవంత్‌ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాదరంగా పలకరించారు. అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. విష్ణు ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

అనంత్ అంబానీ ‘వనతారా’కు సిట్ క్లీన్ చిట్

image

అనంత్ అంబానీ గుజరాత్‌లో స్థాపించిన ‘వనతారా’ జంతు సంరక్షణ కేంద్రానికి SCలో ఊరట లభించింది. వనతారాకు విదేశాల నుంచి ఏనుగుల తరలింపుపై దాఖలైన పిల్‌ను విచారించి కొట్టేసింది. సిట్ వనతారాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. ఏనుగులను యజమానులకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

News September 16, 2025

నేడు భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.

News September 16, 2025

మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

image

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్‌-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.