News October 8, 2025
మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.
Similar News
News October 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 8, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 08, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 8, 2025
ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.